Friday, May 17, 2024

Breaking : ఒకే కుటుంబంలో ఐదుగురు స‌భ్యులు ఆత్మ‌హ‌త్య – బాలుడి ప‌రిస్థితి విష‌మం

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స‌భ్యులు 7వ అంత‌స్తు నుండి దూకి ఆత్మ‌హత్య చేసుకున్నారు. స్విట్జర్లాండ్లోని మాట్రిక్స్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వారు తమ కొడుకుని పాఠశాలకు పంపించకుండా ఇంటివద్ద చదివించడానికి గల కారణాలు విచారించేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు. వారు ఎంతసేపు తలుపు కొట్టినా ఎలాంటి స్పందన కనిపించచకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే కాసేపటికి స్థానికులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి రాగానే కుటుంబ సభ్యుల్లో నలుగురు చనిపోయి కనిపించారు. ఒక‌ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు చాలా ఏళ్లుగా స్విట్జర్లాండ్ లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్ డ్ గా ఉంటుందని పెద్దగా ఎవరితోనూ కలవరని స్థానికులు తెలిపారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపించకుండా హోమ్ స్కూల్లో చదివించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement