Sunday, March 3, 2024

Breaking: బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు.. విచార‌ణ‌కు రాకుంటే అరెస్టు చేస్తామ‌న్న పోలీసులు

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు య‌త్నించిన స్వామీజీల వ్య‌వ‌హారంలో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు అంద‌జేసింది. ఈనెల 21న త‌మ ముందు హాజ‌రుకావాల‌ని సిట్ అధికారులు నోటీజులు అంద‌జేశారు. హైద‌రాబాద్‌లోని క‌మాండ్ కంట్రోల్ సెంట్ర‌ల్‌లో ప్ర‌త్యేక విచార‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి 41ఏ సీర్‌పీసీ కింద నోటీసులు అంద‌జేశామ‌ని, విచార‌ణ‌కు రాకుంటే అరెస్టు చేస్తామ‌ని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement