Sunday, May 5, 2024

‘ఒమిక్రాన్’ కి ఆనంద‌య్య మందు – యూకే, యూఎస్ ఏకి పంపిణి

ప్ర‌పంచ‌మంత‌టా క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కూడా వ్యాపిస్తుంది. ఈనేప‌థ్యంలో ఆయుర్వేద నిపుణుడు ఆనంద‌య్య పేరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఒమిక్రాన్ కి కూడా తాను మందును త‌యారు చేశాన‌ని తెలిపారు. అంతేకాదు ఈ మందు పంపిణీ కూడా ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని అన్నారు. మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదని చెప్పారు. అయితే ఈ మందుని బూస్టర్ డోస్ మాదిరిగా ఒమిక్రాన్ సోక‌క‌ముందే వేసుకోవాల‌ని చెప్పారు. 22ర‌కాల దినుసుల‌తో , ఐదు ర‌కాల మందులు త‌యారు చేసిన‌ట్టు వెల్ల‌డించారు ఆనంద‌య్య‌. ఈ మందును ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. తన మందుల తయారీకి కోర్టుల అనుమతి కూడా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూకే, యూఎస్ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నామని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement