Wednesday, May 1, 2024

ఏషియ‌న్ ఫిల్మ్ అవార్డ్స్.. ఆరు కేటగిరీల్లో పొన్నియన్ సెల్వన్.. రెండు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్

రెండు భార‌తీయ చిత్రాలు ఏషియ‌న్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేష‌న్లలో ఎంపిక అయ్యాయి. రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఆర్ఆర్ఆర్, ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలు ఎంపికయ్యాయి. రాఆరు కేటగిరీల్లో పొన్నియన్ సెల్వన్.. రెండు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ చోటు సంపాదించాయి.

పొన్నియన్ సెల్వన్ బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్), బెస్ట్ సినిమాటోగ్రఫీ (రవి వర్మన్), బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ (ఏఆర్ రెహమాన్), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (ఎక లఖాని), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (తోట తరణి) విభాగాల్లో అర్హత లభింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస మోహన్), బెస్ట్ సౌండ్ (అశ్విన్ రాజశేఖర్) విభాగాల్లో అర్హత పొందింది. మన దేశం నుంచి కేవలం ఈ రెండు సినిమాలకే చోటు లభించింది. ఏషియల్ ఫిల్మ్ అవార్డ్స్ అకాడమీ స్వయంగా ట్విట్టర్ లో దీనిపై ప్రకటన చేసింది. హాంగ్ కాంగ్ ప్యాలస్ మ్యూజియంలో మార్చి 12, ఆదివారం రాత్రం 7.30 గంటలకు 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement