Sunday, October 13, 2024

RRR టీమ్ కు అమిత్ షా విందు.. సత్కారం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 23వతేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్కార్ పురస్కారం పొందిన ఆర్ఆర్ఆర్ టీమ్ తో ఆయన భేటీ కానున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆ చిత్ర బృందానికి అమిత్ షా స్వయంగా తేనీటి విందు ఇవ్వనున్నారు. అలాగే ఈ చిత్ర యూనిట్ ను ఘనంగా సత్కరించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య, రచయిత విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకులు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్ తో పాటు ఆ చిత్ర హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లకు విందుకు హాజరు కావాల్సిందిగా స్వయంగా అమిత్ షా ఆహ్వానం పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement