Monday, May 20, 2024

agriculture: వరి వద్దంటిరి.. మరేం పంటలు వేయాలే.. అధికారులకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాసంగి సీజన్‌ వచ్చినా సాగుచేయాల్సిన పంటల ప్రణాళికను వ్యవసా యశాఖ ప్రకటించలేదు. ఈయేడు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలన్న భావనతో ఉన్న వ్యవసాయశాఖకు వరి స్థానంలో ఏ పంట సాగుచేయించాలన్న అంశం ఇంకా కొలిక్కి రాలేదు. వానాకాలం వరి పంట చేతికొసున్నా.. ఇంత వరకూ పంటల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించక పోవడంతో వ్యవసాయ శాఖ ఓన్లీ యాక్షన్‌.. నో ప్లాన్‌ అన్నట్టు వ్యవహ రిస్తోందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

అక్టోబర్‌ మొదటి వారంలోపే యాసంగి ప్రణాళిక ప్రకటించాల్సి ఉన్నా సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో పంటల సాగు వివరాలు తెలపడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ముందు నుంచీ ప్రత్యామ్నాయ పంటల గురించి చెబుతున్నా శాఖ పట్టించుకోకపోవడంతోనే ప్రస్తుతం ప్రణాళిక ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. యాసంగిలో పంటల మార్పిడికి సంబంధించి ఉన్నతా ధికారులు జిల్లాల నుంచి మళ్లి అంచనాలు, విస్తీర్ణం, పం టల వివరాలు సేకరిస్తున్నట్టు సమాచా రం.

ఇప్పటికే ఒకసారి వివరాలు సేకరించినప్పటికీ వాటిలో పూర్తివివరాలు లేవని తెలుస్తోంది. ప్రధానంగా యాసంగి పంట లకు సంబంధించి గతంలో తయారు చేసిన ఓ ప్రణాళిక పూర్తి అశాస్త్రీయంగా ఉండడం వలన కూడా మళ్లి ఇపుడు మరోసారి జిల్లాల నుంచి అంచనాలు తెప్పించాల్సి వస్తోందని తెలియవస్తోంది. జిల్లా, మండల, గ్రామాల్లోని విస్తరణాధికారులు పొలాల వద్దకు వెళ్లి భూమిని పరిశీలించి ఏ పంట వేశారు, ఆ భూమి మిగతా ఏ పంటలకు అనుకూలం అన్న వివరాలను పొందు పరచాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అధికారులు స్పష్టమైన వివరాలు పొందుపరచకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత రావడంలేదని సమాచారం.

దీనికి సంబం ధించి ముందుగా అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై ఒక స్పష్టతకు వస్తే రైతులకు అవగాహన కల్పించే వీలుంటుందని రైతు సంఘం నేత ఒకరు చెప్పారు. యాసంగి పంటల సాగులో ప్రత్యేకమైన పరిస్థితి రావడంతో వరి స్థానంలో ఇతర ఏ పంటలు సాగుచేయిం చాలన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం ఆశించిన మేర రావడంలేదు. అక్టోబర్‌ 1నే యాసంగి పంటల ప్రకటన చేయాలని వ్యవసాయ శాఖ భావించినా ఇప్పటివరకూ సాగు ప్రణాళికను ప్రకటించలేక పోయారు. ప్రత్యామ్నాయ పంటలు, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల కోసం ఏర్పాటుచేసిన మార్కెట్‌ అనాలసిస్‌ వింగ్‌ కూడా పూర్థిస్థాయిలో పంటల మార్పులో నివేదిక ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది.

హార్టీ.. అగ్రి కలిసి ప్రణాళిక వేస్తేనే..
పంటల మార్పిడి, వరి స్థానంలో ఇతర పంటలకు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ, ఉద్యానవన శాఖలు కలిపి చర్చించి ప్రణాళికలు రూపొందిస్తే ఫలితం ఆశించిన మేర వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్పిడి అంశంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్యానవన పంటలకు అనువైన భూములు కూడా ఉండడంతో నిత్యావసరాలను సాగుచే యించే అవకాశం ఉందని రైతు సంఘం నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యానవన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కలిసి ప్రణాళిక తయారుచేస్తే శాస్త్రీయంగా వచ్చే అవకాశం ఉండడంతో పాటు పంటల్లో మార్పులొస్తాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement