Wednesday, October 9, 2024

Breaking | ముంబైలో ఘోరం.. బిల్డింగులో మంటలు, ఏడుగురు సజీవ దహనం

ముంబైలోని గోరేగావ్‌లో ఇవ్వాల (శుక్రవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ ఏడంతస్థుల బిల్డింగులో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నికీలల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలుచేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడినవారిలో 12 మంది మగాళ్లు, 28 మంది ఆడాళ్లు ఉన్నారని సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటల్లో పలు ద్విచక్రవాహనాలు, కార్లు దగ్ధమయ్యాయి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement