Saturday, June 1, 2024

Breaking: బైకుని ఢీకొట్టిన లారీ, ఇద్ద‌రు మృతి- మ‌రొక‌రికి సీరియ‌స్‌.. ఖ‌మ్మం జిల్లాలో ఘ‌ట‌న‌

ఖమ్మం జిల్లాలో ఇవ్వాల (శ‌నివారం) సాయంత్రం రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కొనిజర్ల మండలంలోని పల్లిపాడు కోల్డ్ స్టోరేజీ సమీపంలో గుర్తుతెలియని లారీ బైకును ఢీకొట్టింది. వైరా వైపు నుండి కొనిజర్ల వైపు ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడకక్కడే చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్రగాయాల‌య్యాయి. దీంతో అత‌డిని 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. కాగా, ఈ ముగ్గురు యువకులు కొనిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన వారుగా తెలిసింది. కేసు నమోదు చేసి కొనిజర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement