Friday, April 26, 2024

పులికాట్‌ సరస్సులో మొరాయించిన పడవ.. తప్పిన ప్రమాదం…

నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సులో నాటు పడవ మొరాయించింది. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు 2గంటల పాటు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. తడ మండల పరిధిలోని ఇరకం దీవి నుంచి తమిళనాడులోని సున్నపుగుంటకు రోజూ నాటు పడవల్లో విద్యార్థులు వెళ్తుంటారు. బుధవారం కూడా 60మంది విద్యార్థులు ఒక పడవలో పాఠశాలకు వెళ్లారు. తిరిగి సాయంత్రం అదే పడవలో ఇళ్లకు బయల్దేరారు. అయితే సరస్సులో పడవకు జాలర్లు వేసిన వలలు తగులుకోవడంతో కదలకుండా మొరాయించింది.

దీంతో సరస్సులోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ 2గంటల పాటు గడపాల్సి వచ్చింది. దీనికి తోడు సరస్సులో నీళ్లు అధికంగా ఉండడం, అలల తాకిడి ఎక్కువ ఉండడం, చీకటి పడిపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. చివరకు గ్రామస్తులంతా రెండు పడవలు తీసుకొని బయల్దేరి.. విద్యార్థులను తాము వెళ్లిన పడవల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement