Friday, May 17, 2024

12గంట‌ల విచార‌ణ‌-100కిపైగా ప్ర‌శ్న‌లు-ముగిసిన సోనియాగాంధీ ఈడీ విచార‌ణ‌

నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల‌కు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇప్ప‌టికే రాహుల్ గాంధీ విచార‌ణ ముగియ‌గా… తాజాగా సోనియాను అధికారులు విచారిస్తున్నారు.ఈ నెల 21న తొలిసారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీని మంగ‌ళ‌వారం కూడా విచార‌ణ‌కు పిలిపించిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఆమెను అధికారులు ఏకంగా 6 గంట‌ల పాటు విచారించారు. ఈ నెల 21న 3 గంట‌ల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. ఇలా మొత్తంగా మూడు రోజుల పాటు ఆమెను 12 గంట‌ల పాటు అధికారులు విచారించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది.

దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ విచారణలో.. ఈడీ అధికారులు 100కి పైగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. మంగళవారం సోనియా విచారణ అనంతరం.. ఆమె ప్రశ్నలకు వేగంగా సమాధానం చెబుతున్నట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. , నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఆమె ప్రమేయంపై సోనియా గాంధీని ప్రశ్నించారు. యంగ్ ఇండియన్‌లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నందున.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలతో సోనియా గాంధీ సమాధానాలను సరిపోల్చనుంది. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పలు దఫాలుగా రాహుల్ గాంధీని 5 రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను ఈడీ అధికారులు దాదాపు 150 ప్రశ్నలు అడిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement