Monday, May 20, 2024

WPL MIvsDC | తొలిపోరులో ముంబైదే విజయం..

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో భాగంగా. బెంగ‌ళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 చేసింది. కాగా, డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్ చేజింగ్‌లో అదరకొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్(55), యాస్తికా భాటియా(57) హాఫ్ సెంచ‌రీల‌తో చ‌ల‌రేగారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై జ‌ట్టు.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్‌ అలీస్‌ క్యాప్సీ.. (75) అర్థ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. క్యాప్సీతో పాటు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (31), జెమీమా రోడ్రిగ్స్‌ (42) లు రాణించారు. ముంబై బౌలర్లలో నటాలీ సీవర్‌ బ్రంట్‌, అమెలియా కెర్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement