Tuesday, April 30, 2024

డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్‌ పదవికి గుడ్‌బై చెప్పిన‌ విన్స్‌ మెక్‌ మ్యాన్‌..

వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యధికంగా టీవీ వీక్షకులు ఉన్న రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ”డబ్ల్యూడబ్ల్యూఈ”. చైర్మన్‌, సీఈవోపై రాసలీలల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చైర్మన్‌, సీఈవో పదవికి విన్స్‌ మెక్‌ మ్యాన్‌ రాజీనామా చేసి వైదొలగాడు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలనే లక్ష్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్‌ విన్స్‌ మెక్‌ మ్యాన్‌ తెలిపారు.

మాజీ ఉద్యోగితో ఎఫైర్‌ నడిపిన విన్స్‌.. ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు సదరు ఉద్యోగితో 3 మిలియన్‌ డాలర్ల (రూ.23.4 కోట్లు) మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాజాగా వెలుగు చూసింది. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్‌ పదవికి విన్స్‌ మెక్‌ మ్యాన్‌ రాజీనామా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement