Monday, October 21, 2024

T20WC | న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ విజయం..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడిచింది. గ్రూప్-సీలో భాగంగా గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్‌పై అఫ్గాన్ 84 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు చేసింది.

అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. ఇబ్రహీం జద్రాన్ (44; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిదానంగా ఆడాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/22), మ్యాట్ హెన్రీ (2/37) చెరో రెండు వికెట్లు, ఫెర్గూసన్ (1/28) ఓ వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ పోరాట పటిమ చూపించలేదు. న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 75 పరుగులకు కుప్పకూలింది. ఫజాల్లా ఫరూకీ (4/17), రషీద్ ఖాన్ (4/17) చెరో నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. మహ్మద్ నబీ (2/16) రెండు వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement