Friday, May 3, 2024

సీవోఏ ప్రతిపాదనలకు సుప్రీం ఓకే..

న్యూఢిల్లి: అడ్మినిస్ట్రేటర్స్‌ కమిటీ (సీవోఏ) రూపొందించిన అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ముసాయిదా రాజ్యాంగం ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. 250 సూచనలతో కూడిన నివేదికను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి అడ్మినిస్ట్రేటర్స్‌ కమిటీ అందజేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ సూర్య కాంత్‌, ఏఎస్‌ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఆమోదం తెలిపింది.

జులై 28 నుంచి అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో భారత్‌ ఫుట్‌బాల్‌ బృందం ఫిఫా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీలో భారత్‌ బృందం పాల్గొనాల్సి ఉన్నదని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈఏడాది సెప్టెంబర్‌ 15లోపు ఏఐఎఫ్‌ఎఫ్‌ రాజ్యాంగం తయారు చేసి, ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement