Friday, April 26, 2024

Breaking: పంజాబ్​ ముందు స్వల్ప టార్గెట్​.. దంచికొడుతున్న ధవన్​

టాటా ఐపీఎల్​ 2022లో ఇవ్వాల పంజాబ్​ కింగ్స్​, హైదరాబాద్​ సన్​రైజర్స్​ మధ్య మ్యాచ్​ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ పంజాబ్​ ముందు పెద్ద టార్గెట్​ ఏమీ పెట్టలేదు. నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు చేసి పంజాబ్​కు 158 పరుగుల టార్గెట్​ పెట్టింది. కాగా, పంజాబ్​  6.3 ఓవర్లు పూర్తయ్యే సరికి 2 వికెట్లు​ కోల్పోయి 66 పరుగులు చేసింది..

ఇక.. క్రికెట్ క్రీడాభిమానుల‌కు క‌నువిందు చేసిన ఐపీఎల్‌-2022 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. సుదీర్ఘంగా సాగిన టాటా ఐపీఎల్‌-2022 టీ-20 టోర్నీలో ఆదివారం జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎలెవెన్‌పై హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ ఒక మోస్త రు ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. అంటే పంజాబ్ గెల‌వాలంటే 158 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది. వ‌రుస ఓట‌ముల‌తో ఈ రెండు జ‌ట్లు ఇప్పటికే ఫ్లే ఆఫ్‌కు దూరం అయ్యాయి. క‌నుక‌ ఈ మ్యాచ్ ఫ‌లితం ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖ‌రారు చేయ‌క‌పోయినా ర్యాంక్‌ల వారీగా ఆయా జ‌ట్ల స్థానాల్లో మార్పు ఉండే అవ‌కాశం ఉంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైద‌రాబాద్ జ‌ట్టులో అభిషేక్ శ‌ర్మ 43, రాహుల్ త్రిపాఠి 20, రొమారియో షెఫ‌ర్డ్ 28, వాషింగ్టన్ సుంద‌ర్ 25, మార్‌క్రమ్ 21 ప‌రుగుల‌తో రాణించారు. వాషింగ్టన్ సుంద‌ర్‌, రొమారియో షెఫ‌ర్డ్ క‌లిసి ఏడో వికెట్ భాగ‌స్వామ్యానికి 57 ప‌రుగులు జ‌త చేశారు. ఇక ప్రియం గార్గ్ 4, నికోల‌స్ పూర‌న్ ఐదు ప‌రుగుల‌తో విఫ‌లం అయ్యారు.

మ‌ధ్యలో, చివ‌రిలో పంజాబ్ బౌల‌ర్ల దాటికి త‌ట్టుకోలేక హైద‌రాబాద్ స్వల్ప వ్యవ‌ధిలో వికెట్ కోల్పోవ‌డంతో భారీ స్కోర్ న‌మోదు చేయ‌లేక చ‌తిక‌ల ప‌డింది. పంజాబ్ బౌల‌ర్లలో నాథ‌న్ ఎల్లిస్ 3, హ‌ర్‌ప్రీత్ బార్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరింటిలో విజ‌యం సాధించిన హైద‌రాబాద్ హైదరాబాద్‌, పంజాబ్‌ 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఏడో స్థానంలో పంజాబ్‌, 8వ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement