Saturday, May 25, 2024

SA vs AFG : సౌతాఫ్రికా టార్గెట్ 245 పరుగులు

అహ్మ‌దాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వ‌ర్సెస్ ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ జ‌రుగుతోంది. 42వ మ్యాచ్ లో ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆప్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.

ఆప్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్లు అజ్మతుల్లా ఒమర్జాయ్ 97పరుగులు, రహ్మత్ షా, నూర్ అహ్మద్ లు 26 పరుగుల చొప్పున చేశారు. రహ్మానుల్లా గుర్బాజ్ 25 పరుగులు చేశారు. సౌతాఫ్రికా విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement