Monday, May 6, 2024

Modi | అశ్విన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు..

టీమిండియా స్టార్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో జాక్ క్రాలీ వికెట్ ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ అశ్విన్ కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. 500 టెస్టు వికెట్లు తీసిన అసాధారణ మైలురాయిని అశ్విన్ అందుకున్నారని ప్రధాని ప్రశంసించారు. అశ్విన్ అందుకున్న విజయాలు అతడి పట్టుదలకు, నైపుణ్యానికి నిదర్శమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి శిఖరాలను ఎన్నింటినో అందుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు అశ్విన్. అనిల్ కుంబ్లే 619 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే 105 టెస్టుల్లో 500 వికెట్లు తీయగా.. శ్రీలంక స్పిన్ దిగ్గజం మురళీధరన్ 87 టెస్టుల్లోనే ఆ ఘనత సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. రోహిత్(131) , జడేజా(112) సెంచరీలతో చెలరేగడంతో 445 రన్స్ చేసింది. ఫస్ట్ టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (46), అశ్విన్ (37), బుమ్రా (26) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement