Monday, April 29, 2024

Mumbai Indians : హార్దిక్ పనైపోయిందా…

ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పరాజయం. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్సీ మార్పు, కొత్త ఆటగాళ్ల రాక జట్టును ప్రభావితం చేయలేకపోయింది.

- Advertisement -

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (63; 45 బంతుల్లో, 5×4, 3×6), నెహాల్ వదేరా (49; 24 బంతుల్లో, 3×4, 4×6) టాప్ స్కోరర్లు. సందీప్ శర్మ అయిదు వికెట్లతో (5/18)తో చెలరేగాడు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (104*; 60 బంతుల్లో, 9×4, 7×6) అజేయం శతకంతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రదర్శన గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. హార్దిక్ హిట్టింగ్ సామర్థ్యం తగ్గిపోతుందని అన్నాడు. ఇది ముంబై ఫ్రాంచైజీతో పాటు భారత క్రికెట్‌కు ఆందోళన కలిగించే అంశమని అన్నాడు. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.

”హార్దిక్ పాండ్య హిట్టింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. వాంఖడేలో అతను భిన్నంగా కనిపిస్తాడు. కానీ బ్యాటింగ్‌కు కాస్త తక్కువగా అనుకూలించే పిచ్‌లు అతన్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి” అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పది బంతుల్లో పది పరుగులు చేశాడు. ఒక్క బౌండరీ సాధించాడు.

ఐపీఎల్‌-2024లో హార్దిక్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. గత అయిదు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 10, 2, 21 *, 39 పరగులు చేశాడు. బౌలింగ్‌లోనూ నిరాశపరిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించి మూడు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement