Wednesday, June 12, 2024

Sports | దిగ్గజాల్లేని మెగాటోర్నీ.. నాథల్​, ఫెధరర్​ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్‌

ఈ ఏడాది జరగనున్న రెండవ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు తొలిసారి దిగ్గజాలు దూరంగా ఉంటున్నారు. 1998 తర్వాత నాదల్‌, ఫెదరర్‌ లేకుండా జరగడం ఇదే తొలిసారి. ఆదివారం నుంచి రోలాండ్‌ గార్రోస్‌లో టోర్నీ ప్రారంభం అవుతుంది. 15రోజుల పాటు జరిగే ఏకైక టోర్నీ కూడా ఇదే. మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌లు 14 రోజులు జరుగుతాయి. మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌ జూన్‌ 10న, పురుషుల సింగిల్స్‌ ఫైనల్స్‌ జూన్‌ 11న జరుగుతాయి.

నాదల్‌ లేదా రోజర్‌ ఫెదరర్‌ లేకుండా జరుగుతున్న మొదటి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఇది. ఫెదరర్‌ 1998లో, నాదల్‌ 2005లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లోకి ప్రవేశించారు. ఫెదరర్‌ గతేడాది రిటైర్మెంట్‌ ప్రకటించగా, హాప్‌ గాయం కారణంగా రోలాండ్‌ గారోస్‌ పర్యటనకు దూరమవుతున్నట్లు నాదల్‌ గత వారం చెప్పాడు. 2018 ఛాంపియన్‌ సిమోనా హాలెప్‌ (తాత్కాలిక డోపింగ్‌ నిషేధం), 2016 ఛాంపియన్‌ గార్బినె ముగురుజా (పర్యటన నుండి విరామం తీసుకోవడం), నాలుగుసార్లు మేజర్‌ విజేత నవోమి ఒసాకా (గర్భిణీ) తదితరులు ఈసారి ఆడటం లేదు. ఆండీ ముర్రె, నిక్‌ కిర్గియోస్‌ కూడా గైర్హాజరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement