Friday, May 17, 2024

Tim Southee | స‌రికొత్త రికార్డు సృష్టించిన కివీస్‌ పేసర్‌..

న్యూజిలాండ్ స్టార్ బౌల‌ర్ టిమ్‌ సౌతీ అరుదైన రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చ‌రిత్ర‌ సృష్టించాడు. పాకిస్తాన్ తో జరిగిన తొలి టీ20లో మహ్మద్‌ రిజ్వాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌లను అవుట్‌ చేసి ఈ ఘనత సాధించాడు. అబ్బాస్‌ ఆఫ్రిదిని అవుట్‌ చేయడంతో అంతర్జాతీయ టీ20లలో 150 వికెట్లు తీసి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టిమ్‌ సౌతీ 151 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement