Tuesday, April 16, 2024

IPL : స్టేడియంలో కావ్య మారన్ క్రేజ్…

టాప్ స్టార్స్ ఆడుతున్నా కెమెరాల‌న్నీ ఆమె వైపు
మార‌న్ సామ్రాజ్యానికి వార‌సురాలు
33 వేల కోట్ల‌కు పైగా ఆస్తులు
ఆమె చేతిలో రెండు క్రికెట్ జ‌ట్లు
ఒంటి చేత్తో అటు క్రికెట్, ఇటు వ్యాపారం
బ్రిట‌న్ లో చ‌దివినా మాతృదేశంపైనే మ‌మ‌కారం
ఎన‌లేని దాతృత్వం…సాయం ఆడిగితే చాలు..
వెంట‌నే చేసే మ‌న‌స్సున్న మ‌హారాణి

కావ్య మారన్ పరిచయం అవసరంలేని పేరు. బిజినెస్ ఉమెన్ గా మార్కెట్ లో మంచి పేరుంది. ఐపీఎల్ వచ్చిన తర్వాత కావ్య మరింత ఫేమస్ అయ్యారు. అటుపై సినిమా ఈవెంట్లలలో సైతం ఎంతో యాక్టివ్ గా పాల్గొంటుంది. గ్యాలరీ లో ఎంత మంది అందగత్తెలు ఉన్నా…కెమెరా కళ్లన్నీ ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్ అవుతుంటాయి. కేవలం ఆమె ఎక్స్ ప్రెషన్స్ కోసమే ఆస్సెషల్ ఫోకస్ అంతా. వాటిని ఎంతో అందంగా క్యాప్చర్ చేస్తారు.

- Advertisement -

అవి నెట్టింట అంతే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు వచ్చాయంటే అక్కడ తప్పక కావ్య ఉంటుంది. ఓ కామన్ ఆడియన్ లా కూర్చోని ఈవెంట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తుంది. మ్యూజిక్ వినిపిస్తే మాత్రం అస్సలు ఆగలేదు. సోషల్ మీడియాలో రకరరకాల ఎక్స్ ప్రెషన్స్ తోనే బోలెడంత పాపులర్ అయింది. ఇక ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిందే. సన్ గ్రూప్ పౌండర్ కళానిధి మారన్ ఏకైక కుమార్తె. కరుణానిధి మనవరాలు.

యూకేలో ఎంబీయే చేసినా విదేశాల్లో స్థిరపడకుండా ఇండియాలో ఉంటూనే తండ్రి బిజినెస్ వ్యాపారాలు చూసు కుంటుంది. . దాదాపు 33 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆమె. ఆమె వ్యక్తిగత ఆస్తులే 417 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రస్తుతం సర్ రైజర్స్ హైదరాబాద్- ఈస్ట్రన్ కేప్ జట్లకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఐపీఎల్ వేలంలో సోలోగా పాల్గోనే కోట్ల రూపాయలు తో టీమ్ మెంబర్లని కొనుగోలు చేసే సత్తా ఉన్న ఉమెన్. చదువు పూర్తయిన వెంటనే వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.

2018లో కావియా మారన్ సన్‌రైజర్స్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయకపోవడంతోపాటు సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన చేసిన సంవత్సరాల్లో ఫ్యాన్స్ కావ్య మారన్‌ను ట్రోల్ కి ఎదుర్కుంది. అయితే క్రమంగా ఆటను ఆకళింపు చేసుకున్న ఆమె.. 2024 సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అంతే కాదు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచింది. ఈస్ట్రన్ కేప్ జట్టును కావ్య మారనే పునాదుల నుంచి నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement