Saturday, May 4, 2024

IPL : ఇవాళ డ‌బుల్ ధ‌మాకా..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌, గుజరాత్‌ జట్లు తలపడనున్నాయి.

- Advertisement -

కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్‌కు చండీఘడ్‌లో ముల్లాన్‌పూర్‌ మైదానం వేదిక కానుంది.ఇవాళ జరుగబోయే రెండు మ్యాచ్‌లలో కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో పరుగుల వరద పారడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై కేకేఆర్‌ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 34 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్‌ 20, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.

పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ప్రస్తుతం కేకేఆర్‌ మూడో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ చివరి స్థానంలో ఉంది. కేకేఆర్‌ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. ఆర్సీబీ ఏడింట ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలుపొందింది.

తుది జట్లు (అంచనా)..
కేకేఆర్‌: ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్‌ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి (ఇంపాక్ట్‌ ప్లేయర్‌: వైభవ్ అరోరా)

ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, అల్జరీ జోసెఫ్, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌: యశ్ దయాల్)

రాత్రి జరుగబోయే మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌-పంజాబ్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఈ రెండు జట్లలో చెప్పుకోదగ్గ హిట్టర్లు లేకపోవడంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు నామమాత్రంగా ఉన్నాయి. అయితే పంజాబ్‌ ఈ సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లు చివరి ఓవర్‌ వరకు తీసుకెళ్లడంతో ఈ మ్యాచ్‌ కూడా రసవత్తరంగా సాగుతుందని అభిమానుల ఆశ.

తుది జట్లు (అంచనా)..
పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిలీ రొస్సో, సామ్ కర్రన్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్‌: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్‌), సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్

Advertisement

తాజా వార్తలు

Advertisement