Wednesday, December 6, 2023

India vs Ausis – ఫస్ట్ వికెట్ డౌన్ … రుతురాజ్ గైక్వాడ్ ఔట్ – భార‌త్ 16/1

ఇండోర్ : ఆసీస్ తో జ‌రుగుతున్న రెండో వ‌న్డే లో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన రుతురాజ్ హాజిల్ వుడ్ బౌలింగ్ లో అవుట‌య్యాడు.. అప్ప‌టికి భార‌త్ స్కోర్ 3.4 ఓవ‌ర్ల‌లో 16 ప‌రుగులు. అంత‌కు ముందు టాస్ నెగ్గిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టును స్టీవ్‌ స్మిత్‌ నడిపించనున్నాడు. తొలివ‌న్డే ను గెలుచుకున్న భార‌త్ ఈ మ్యాచ్ ను సైతం గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.. కాగా బుమ్రా స్థానంలో తుది జట్టులోకి ప్రసిద్ధ్‌ను తీసుకున్నారు.

భారత జట్టు: గిల్‌, గైక్వాడ్‌, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షమీ, ప్రసిద్ధ్‌.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement