Friday, May 17, 2024

గబ్బర్‌ సేన ఏ జట్టునైనా ఓడిచగలదు: బ్రాడ్‌హగ్‌

శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగకు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చురకలంటించారు. బీసీసీఐ లంకకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించిందని, ఇది లంక క్రికెట్‌కు అవమానకరమని ఆ దేశ మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ విమర్శించారు. దీనిపై స్పందించిన బ్రాడ్‌హగ్‌ శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు అత్యంత పటిష్ఠంగా ఉందని తేల్చిచప్పాడు. ప్రపంచంలోని అన్ని ప్రథమశ్రేణి జట్లను ఓడించే సామర్థ్యం ఆ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే వారు అలా మాట్లాడుతున్నారని వెల్లడించాడు.

తొలిసారి టీమ్‌ఇండియా రెండు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో ఉంది. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీసు ఆడనుంది. ఇక శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఇందులో అంతా టీ20 స్పెషలిస్టులే ఉన్నారు. ఆతిథ్య జట్టుతో వీరు 3 వన్డేలు, 3 టీ20ల్లో తలపడనున్నారు. కాగా బీసీసీఐ లంకకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించిందని, ఇది లంక క్రికెట్‌కు అవమానకరమని ఆ దేశ మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ విమర్శించారు. దాంతో కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.‘శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుపై ఆతిథ్య దేశం ఫిర్యాదు చేస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో ఉన్న జట్లనూ గబ్బర్‌ సేన ఓడించగలదు. శ్రీలంక క్రికెట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. భారత్‌ వన్డే, టీ20 సిరీసులు కచ్చితంగా గెలుస్తుంది. రాహుల్‌ ద్రవిడ్‌ ఆటగాళ్లను క్రమశిక్షణతో ఆడించగలడు’ అని బ్రాడ్‌హగ్‌ అన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం తమది ద్వితీయ శ్రేణి జట్టు అనుకోవడం లేదని, సిరీసులను ఆస్వాదించేందుకే ఇక్కడికి వచ్చామని తెలపడం గమనార్హం.

ఇది కూడా చదవండి: మనదేశంలో గసగసాలు పండించడం ఎందుకు నేరం?

Advertisement

తాజా వార్తలు

Advertisement