Sunday, October 6, 2024

Ind vs Eng : మూడో రోజు ముగిసిన ఆట.. 322పరుగుల లీడ్ లో భారత్

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 322 పరుగుల లీడ్ లో ఉంది.

భారత్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ 104 పరుగులు చేసి.. గాయం కావడంతో రైటర్డ్ హర్ట్ తీసుకున్నాడు. అలాగే శుభమన్ గిల్ 65 పరుగులతో, కుల్దీప్ యాదవ్ మూడు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement