Thursday, April 18, 2024

IND vs ENG, 4th Test : ముగిసిన తొలిరోజు ఆట‌… ఇంగ్లండ్ స్కోరు 302/7

రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో టీమిండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జ‌రుగుతున్న‌ నాలుగో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్ జ‌ట్టు తొలిరోజు 90ఓవ‌ర్ల‌లో 7వికెట్ల న‌ష్టానికి 302 ప‌రుగులు చేసింది. జో రూట్ 106 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలువ‌గా, బెన్ ఫోక్స్ 47 ప‌రుగులు, క్రాలే 42 ప‌రుగులు, బెయిర్ స్టో 38 ప‌రుగులు, రాబిన్ స‌న్ 31 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

ఆదిలోనే ఇంగ్లండ్ జ‌ట్టు త‌క్కువ స్కోర్ కే మూడు వికెట్లు కోల్పోవ‌డంతో త‌క్కువ స్కోర్ కే ఆలౌట్ అవుతుంద‌ని అనుకున్న టౌంలో జో రూట్, బెన్ ఫోక్స్, ఆలీ రాబిన్సన్ లు మంచి ఆట‌తీరును క‌న‌బ‌రిచి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ను 302/7కి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement