Thursday, July 25, 2024

IND vs AUS T20 | ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్‌..

భారత్– ఆస్ట్రేలియా మధ్య బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుతున్న ఆఖరి టీ20 మ్యాచ్ లో టీమిండాయా బ్యాటర్లు ఆశించినతీరులో రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా 8 వికెట్ల న‌ష్టానికి కేవలం 160 పరుగులు చేసింది. ఇక 161 పరుగుల టార్గెట్‌తో ఆసీస్ చేజింగ్‌కు దిగనుంది.

భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అక్షర్ పటేల్ (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనపించాడు. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు పెద్దగా పరుగులు చేయలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వార్షుయిస్, జేసన్ బెహ్రాండార్ఫ్ చెరో 2 వికెట్లతో మెరిశారు.

యశస్వి జైస్వాల్ (21), రుతురాజ్ గైక్వాడ్ (10) , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) , రింకూ సింగ్ (6) , జితేశ్ శర్మ (24) .

You May Like

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement