Monday, May 6, 2024

IPL : ఓడితే పంజాబ్ ఇక ఇంటికే..

మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌ లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా.. మరోవైపు గుజరాత్ టైటాన్స్ తమ 7 మ్యాచ్‌ లలో 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు డబుల్ హెడ్డేరు నేపథ్యంలో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది.

- Advertisement -

ఇక ఇరు జట్లు పంజాబ్, గుజరాత్‌ లు ఇప్పటి వరకు కేవలం 4 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. అందులో పంజాబ్ 2, గుజరాత్ 2 మ్యాచ్ లు గెలిచాయి. గుజరాత్ టైటాన్స్ పై ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు 200. ఇక ఈ సీజన్ లో ఏప్రిల్ 4 మ్యాచ్‌ లో గుజరాత్ 199 పరుగులు చేయగా.. చివరి బంతికి పీబీకేఎస్ లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఆటగాళ్ల వివరాలు చూస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టులో శుభమాన్ గిల్ (సి), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్ లు ఉండగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో అశుతోష్ శర్మ, రిషి ధావన్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, విద్వాత్ కావరప్ప

ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో అథర్వ తైదే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసౌ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ లు ఉండగా.. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అశుతోష్ శర్మ, రిషి ధావన్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, విద్వాత్ కావరప్ప

Advertisement

తాజా వార్తలు

Advertisement