Sunday, April 28, 2024

Chennai Floods: స‌హాయం చేయండి….చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్

చెన్నై వరదలపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. చెన్నై వరద దృశ్యాలు కలచివేసింద‌న్నారు. సొంత దేశం ఆస్ట్రేలియా తరువాత భారతదేశంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటమే కాకుండా ఇక్కడి వారితో అతనికి అనుబంధమెక్కువ.

చెన్నై వరద పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్ సహాయం అందించాలని పిలుపిచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వరద పోటెత్తడంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. ఎవరైనా సహాయం చేసే పరిస్థితిలో ఉంటే తప్పకుంజా సహాయం చేసేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. ఒకరికొకరు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని, అందరూ కలిసి రావాలని వార్నర్ పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement