Sunday, May 5, 2024

మాల్దీవుల్లో రింకూ సింగ్.. హీరో అంటూ కామెంట్ పెట్టిన గిల్ సోద‌రి

మాల్దీవుల్లో సేద తీరుతున్నాడు రింకూసింగ్. ఈ మేర‌కు త‌న ఇన్ స్టాలో కొన్ని ఫొటోల‌ని షేర్ చేశాడు.ఈ ఫోటోల‌కు శుభ‌మ‌న్ గిల్ సోద‌రి షాహ‌నీల్ కామెంట్ చేసింది. ఓ హీరో అంటూ ఆ పోస్టుకు లైక్ కొట్టింది. బీచ్‌లో రింకూ సింగ్ దిగిన ఫోటోలు ఆన్‌లైన్ వైర‌ల్ అయ్యాయి. సిక్స్ ప్యాక్ లుక్‌లో ఉన్న రింకూ ఫోటోల‌కు అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. గ‌తంలో రింకూ ఆడిన కేకేఆర్ టీమ్‌తోనే షాహ‌నీల్ అన్న‌ గిల్ ఆడేవాడు. అయితే 2023 సీజ‌న్‌లో మాత్రం గిల్ గుజ‌రాత్‌కు ఆడాడు. గిల్‌, నితీశ్ రాణ్‌, గిల్ సోదరి షాహ‌నీల్‌లు రింకూకు మంచి ఫ్రెండ్స్‌. ఇటీవ‌ల ఐపీఎల్ టోర్నీలో రింకూ నాలుగు హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశాడు. ప‌లు మార్లు రింకూ భారీ ఇన్నింగ్స్ ఆడినా.. కేకేఆర్ మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. గుజ‌రాత్‌తో జ‌రిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో వ‌రుస‌గా రింకూ అయిదు సిక్స‌ర్లు కొట్టిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement