Saturday, July 27, 2024

Final T20 battle | టాస్ నెగ్గిన ఆసీస్.. మొద‌టి బ్యాటింగ్ భార‌త్ దే !

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది యంగ్‌ఇండియా. ఇక ఇవ్వాల (ఆదివారం) బెంగళూరు వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ కు చేయనుండగా.. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ చివరి మ్యాచ్ లోనూ నెగ్గి గెలుపుతో సిరీస్ ను ముగించాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది.

ఇక ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒక మార్పు చేసింది. గ్రీన్ స్థానంలో నాథన్ ఎలీస్ జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా టీమిండియా కూడా ఒక మార్పు చేసింది. దీపక్ చహర్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంది.

తుది జట్లు

టీమిండియా

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (C),  రింకూ సింగ్, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్,  ముకేశ్ కుమార్

- Advertisement -

ఆస్ట్రేలియా

ఫిలిఫ్పీ, ట్రావిస్ హెడ్, మెక్ డోర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (c & wk), షార్ట్, డ్వార్షుయిస్, నాథన్ ఎలీస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ

Advertisement

తాజా వార్తలు

Advertisement