Sunday, April 28, 2024

IPL : ఇవేం పిచ్‌లు రా అయ్యా..? సిక్స్ లే సిక్స్ లు

ఐపీఎల్ 2024 సీజన్‌లో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టేయిన్ అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, కోల్‌కతా మైదానాల్లో 300 పరుగులు కొట్టేలా ఉన్నారని ఎక్స్‌వేదికగా అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు అత్యధి స్కోర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 277/3 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన ఆరెంజ్ ఆర్మీ.. సోమవారం బెంగళూరు వేదికగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 287/3 పరుగులు చేసి తమ రికార్డ్‌ను మెరుగుపరుచుకుంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం చూసి డేల్ స్టెయిన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘బెంగళూరు, ముంబై, కోల్‌కతా.. ఈ సీజన్ కాకపోవచ్చు. కానీ ఈ మూడు మైదానాల్లో 300 పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది.’అని స్టెయిన్ ట్వీట్ చేశాడు. పరోక్షంగా పిచ్‌ల తీరును తప్పుబట్టాడు. ఈ పోస్ట్‌కు ఓ సీఎస్‌కే అభిమాని.. చెపాక్ వేదికగా అయితే 300 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదని ఓ అభిమాని కామెంట్ చేయగా.. డేల్ స్టెయిన్ హుందాగా స్పందించాడు. నీ కామెంట్‌తో ఏకీ భవిస్తున్నానని తెలిపాడు.
కొందరు అభిమానుల అయితే ఇంపాక్ట్ రూల్ కారణంగా బ్యాట్, బంతికి మధ్య సమతూకం లేకుండా పోయిందని, పూర్తిగా బ్యాటర్ల రాజ్యమే నడుస్తుందని బౌలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement