Sunday, April 28, 2024

బుమ్రా బూస్ట్‌, బౌలర్లలో జస్‌ప్రీత్ నెంబ‌ర్ వ‌న్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌-4

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలుపు అటు జస్‌ప్రీత్‌ బుమ్రాకు, ఇటు భారత్‌ జట్టుకు ర్యాంకింగ్స్‌లో కలిసొచ్చింది. వన్డేల్లో బౌలర్ల విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రాకు అగ్రస్థానం దక్కగా, వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ జట్టు 3వ స్థానానికి ఎగబాగింది. ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్‌ విడుదలు చేసింది. వన్డే బౌలర్ల విభాగంలో 718 పాయింట్లతో బుమ్రా నంబర్‌వన్‌ స్థానం దక్కించుకోగా, 712 పాయింట్లతో ట్రెంట్‌ బౌల్ట్‌, 681 పాయింట్లతో షహీన్‌ అఫ్రిది రెండు మూడు స్థానాల్లో నిలిచారు. టాప్‌-10 బుమ్రా మినహా భారత బౌలర్లు ఎవరికీ స్థానం దక్కలేదు. ఇక వన్డే బ్యాటర్స్‌లో విరాట్‌ కోహ్లీ 803 రేటింగ్‌తో 3వ స్థానం, 802 రేటింగ్‌తో రోహిత్‌ శర్మ 4వ స్థానంలో నిలిచారు. 892 రేటింగ్స్‌తో బాబర్‌ అజమ్‌ (పాక్‌) అగ్రస్థానం సంపాదించుకోగా, 815 రేటింగ్‌తో ఇమామ్‌ ఉల్‌ హక్‌ (పాక్‌) ద్వితీయ స్థానంలో నిలిచాడు. తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ 126 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా, 112 పాయింట్లతో ఇంగ్లండ్‌, 108 పాయింట్లతో భారత్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌ జట్టు 104 పాయింట్లతో 4వ స్థానంలో ఉండేది. ప్రస్తుత జాబితాలో 106 పాయింట్లతో పాకిస్తాన్‌ 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (101), సౌతాఫ్రికా (99), బంగ్లాదేశ్‌ (96), వెస్టిండీస్‌ (71), అఫ్గనిస్తాన్‌ (69), ఐర్లాండ్‌ (54) ఉన్నాయి.

టీ20 ర్యాంకింగ్స్‌లో ఇండియా 10514 పాయింట్లు (270 రేటింగ్‌)తో అగ్రస్థానం దక్కించుకోగా, ఇంగ్లండ్‌ 8192 పాయింట్లు (264 రేటింగ్‌), పాకిస్తాన్‌ 7826 పాయింట్లు (261 రేటింగ్‌)తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టీ20 బ్యాటర్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 732 రేటింగ్‌తో 5వ స్థానం దక్కించుకోగా, బాబర్‌ అజమ్‌ 818 రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మొమహ్మద్‌ రిజ్వాన్‌ 794 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. మిగిలిన భారత బ్యాటర్లెవరికీ టాప్‌-10లో చోటు లభించలేదు. బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 658 రేటింగ్‌తో 7వ స్థానం దక్కించుకున్నాడు. మిగిలిన వారెవరికీ టాప్‌-10లో స్థానం దక్కలేదు.
ఇక మూడు ఫార్మాట్లలో టాప్‌-3గా ఉన్న జట్టుగా టీమిండియా అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో 3వ ర్యాంకులో ఉన్న భారత జట్టు, టెస్టుల్లో రెండో స్థానంలో, టీ20ల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా మూడు ఫార్మాట్లతో టాప్‌-3లో ఉన్న జట్టు లేదా జట్లు మరొకటి లేకపోవడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement