Monday, May 27, 2024

IPL | ఐపీఎల్‌ 2024 సీజన్‌కు బెన్‌స్టోక్స్‌ దూరం

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌, టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీకి గురువారం తెలియజేశాడు. రిటైర్మెంట్‌ ప్రకటన నుంచి యూటర్న్‌ తీసుకుని, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొన్న స్టోక్స్‌, మోకాలి శస్త్రచికిత్సకు వెళ్లనున్నాడు. జనవరిలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నాటికి కోలుకునే అవకాశం ఉంది. అయితే, ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌ దృష్ట్యా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement