Friday, May 3, 2024

BAN vs PAK : పాక్ టార్గెట్ 205 పరుగులు

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆశించినంతగా భారీ స్కోర్ చేయలేకపోయింది.

ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు మహ్మదుల్లా 56 పరుగులు, లిటన్ దాస్ 45 పరుగులు, షకీబ్ అల్ హసన్ 43 పరుగులు, మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 205 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement