Friday, May 3, 2024

AUS Vs NZ : న్యూజిలాండ్ టార్గెట్ 389 పరుగులు

వన్‌డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్‌లు దంచి కొడుతున్నారు. ఆసీస్‌ ఓపెనర్‌లు డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్ పరుగుల వరద పారిస్తున్నారు. ఫోర్లు, సిక్సర్‌లతో న్యూజిలాండ్‌ ఫీల్డర్లను మైదానం అంతటా పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ఇద్దరూ చితక బాదడంతో ఆసీస్ స్కోరు భారీ స్కోరు దిశగా వెళ్లింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు భారీ టార్గెట్ ను కేటాయించింది.

ఆసీస్ బ్యాట్స్ మెన్లు ట్రావిస్ హెడ్ 109 పరుగులు, డేవిడ్ వార్నర్ 81 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 41 పరుగులు, ఇల్లింగ్స్ 38 పరుగులు, కమ్మిన్స్ 37 పరుగులు, మిట్చెల్ మార్ష్ 36 పరుగులు చేశారు. దీంతో ఆసీస్ స్కోరు 370 పరుగులకు చేరుకుంది. న్యూజిలాండ్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 389 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement