Friday, May 17, 2024

ముంబై టీమ్​లోకి అర్జున్‌ టెండూల్కర్‌ ఎంట్రీ.. జట్టు విజయం కోసం ఏదైనా చేస్తామన్న కోచ్​

సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ విషయంలో ముంబై ఇండియన్స్‌ కోచ్‌ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టులోని ప్రతీ ఒక్కరు ఆప్షనే అని, పరిస్థితులను బట్టి ఎవరిని ఆడించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆటగాళ్ల ఎంపిక అనేది మ్యాచ్‌ ఫలితాలను బట్టి ఉంటుందని, జట్టు విజయం కోసం కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేయడమే తమ ప్రాధాన్యత అన్నాడు. ప్రతీ మ్యాచ్‌ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని, తాము మొదటి విజయాన్ని అందుకున్నామన్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉందని, అందులో అర్జున్‌ టెండూల్కర్‌ ఉంటే తప్పకుండా అవకాశం ఇస్తామని, అయితే ఇది జట్టు కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుందని జయవర్దనే స్పష్టం చేశారు.

బ్యాటింగ్‌ వైఫల్యంపై రోహిత్‌ నిరాశగా ఉన్నాడని, అయితే రోహిత్‌ బ్యాటింగ్‌ వైఫల్యం కన్నా.. తమ ప్రణాళికలను అమలు చేయడమే ముఖ్యమని తెలిపాడు. సుదీర్ఘ కాలంగా రోహిత్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని, ఇతర బ్యాటర్లు రోహిత్‌ను అనుసరించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే సరైన ఆరంభాలను అందించలేకపోతున్నామనే నిరాశగా ఉన్నాడని తెలిపాడు. గేమ్‌ ప్రణాళికలు అమలు చేయడం ముఖ్యమన్నాడు. అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ జట్టు రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రధాన పేసర్లు విఫలం కావడంతో.. అర్జున్‌ అరంగేట్రం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement