Saturday, May 11, 2024

58th Match : ల‌క్నో టార్గెట్ 183 ప‌రుగులు

హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జైంట్స్ జ‌ట్ల 58వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్ మెన్ హెన్రీచ్ క్లాసెన్ 47 పరుగులు చేయగా.. అబ్దుల్ సమ్మద్ 37 పరుగులు, అన్మోల్ ప్రీత్ సింగ్ 36పరుగులు చేశారు. ల‌క్నో సూప‌ర్ జైంట్స్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 183 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement