Wednesday, May 1, 2024

3rd ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియాల జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ ఇవాళ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వన్డేల్లో ఎప్పుడూ కంగారులను వైట్ వాష్ చేయని భారత్.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి రానున్నాడు.

అయితే తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే.. ఆఖరి సమరానికి టీమిండియా సిద్ధమైంది. క్లీన్ స్వీప్ ఊరిస్తుండగా, ప్రపంచకప్ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. మూడో వన్డేలో ఇవాళ‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. మరి రోహిత్ సేన మరోసారి అభిమానులను మురిపిస్తుందా! 3-0తో సిరీస్ ను ముగిస్తుందా అనేది వేచి చూడాలి. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement