Sunday, April 28, 2024

Samyukta Menon :సంయుక్త ఎక్క‌డ‌…

సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ ను సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.

- Advertisement -

తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.తాజాగా అదిరిపోయే డ్రెస్సులో ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం మాత్రం పెద్దగా ఈమెకి అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే ఈమెకి ఎందుకు సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు అనే దానిపై ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తున్నారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఈ అమ్మడు ఎక్కువగా గ్లామర్ షో చెయ్యడం లేదు దానికే ఆఫర్స్ రావడం లేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొందరు హీరోయిన్లు గ్లామర్ ను నమ్ముకున్నారు.. వాళ్ల సినిమాలు ప్లాప్ అయినా కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఈ అమ్మడుకు మాత్రం ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. కానీ పెద్దగా క్రేజ్ రాలేదు. ఇక ఈమె సోషల్ మీడియా లో కాస్త అందాల డోస్ పెంచితే అవకాశాలు రావచ్చునని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement