Friday, February 9, 2024

Megha Event: ప్ర‌ముఖుల‌కు చిరంజీవి విందు…ముఖ్య‌మంత్రి రేవంత్ హాజ‌రు…

హైద‌రాబాద్ – ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా సినీ నటుడు చిరంజీవి గత రాత్రి హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
   

పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. మెగాస్టార్‌కు ఈ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. సినీ హీరో రామ్‌చరణ్‌తో కూడా కొద్ది సేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement