Sunday, April 14, 2024

Honey Rose: 40 ఏళ్లలోనూ నాటు అందం…

సినిమా ఆఫర్లు లేకున్నా.. సంపాదనలో మాత్రం తగ్గదే లేదు అంటోంది బాలయ్య భామ హానీ రోజ్. సినిమాల్లో నటించడంలేదు కాని.. చేతినిండా సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె ఏం చేస్తోందో తెలుసా..? 40 ఏళ్లు దాటినా.. నాటు అందాలతో.. కుర్రాళ్ళ చేత కేకలు వేయించే హనీరోజ్.. చాలా కాలం తరువాత బాలయ్య సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఏడాది క్రితం వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో నటించి మెప్పించింది హనీ రోజ్.

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్ర కారును తన అందంతో తన చుట్టూ తిప్పుకుంది బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా తరువాత హనీరోజ్ ఫ్యాన్స్ తో పాటు..సోపల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. .. సినిమా అవకాశాలు మాత్రం రాలేదు హనీకి .. కాని వ్యాపార సంస్థల ఓపెనింగ్ లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి హనీరోజ్ కు. మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్ తోనే ఫుల్ గా సంపాదించేస్తుందంట ఈ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement