Sunday, May 19, 2024

Zero Tempratures – ఢిల్లీ గ‌జ‌గ‌జ‌! ప‌డిపోతున్న టెంప‌రేచ‌ర్లు

దేశంలో చలితీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్ర‌వారం ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గడ్డకట్టిన దాల్‌ సరస్సు..
భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని ఏరియాల్లో అయితే మైనస్‌ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో చలి తీవ్రతకు లోపలిభాగంలోని నీరు గడ్డకడుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement