Friday, May 17, 2024

World Tiger Day – పూరీ తీరంలో మట్టితో 15 అడుగుల పులి రూపం

పూరీ – ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో మట్టితో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు.

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement