Saturday, July 27, 2024

Wild Fire – గ్రీస్‌లో కార్చిచ్చు… ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని పారిపోతున్న జ‌నం ..

గ్రీస్ – ద్వీప సమూహ దేశమైన గ్రీస్‌లో కార్చిచ్చు అల్లకల్లోలం సృష్టిస్తోంది. గత ఆరు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూమి.. ఇళ్లు, హోటళ్లను దహనం చేసుకొంటూ జనావాసాలపైకి వస్తోంది. ఈ దేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంట్రీగేడ్‌లు దాటడంతో ఈ కార్చిచ్చు అంటుకొంది. రోడ్సే ప్రాంతంలో దాదాపు వారం నుంచి మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి మెల్లగా అగ్నికీలలు మధ్యగ్రీస్‌, తూర్పు ప్రాంతాల్లోకి వ్యాపిస్తున్నాయి. ఈ చిరు దేశంలో దాదాపు 40 ఫైర్‌ ఇంజిన్లు, 200 మంది సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. మూడు విమానాలు, ఐదు హెలికాప్టర్లు ఈ మంటలను ఆర్పేందుకు పనిచేస్తున్నాయి. మరో వైపు ఐరోపా సమాఖ్య దేశాలు కూడా సహాయాన్ని పంపాయి. వీటితో తుర్కియే, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌, క్రొయేషియా దేశాలు కూడా సహాయ సామగ్రిని అందించాయి.

ఇప్పటి వరకు దాదాపు 19 వేల మంది స్థానికులను, పర్యాటకులను రోడ్సే నుంచి కాపాడారు. వీరిలో 16 వేల మందిని భూమార్గాన, 3,000 మందిని సముద్ర మార్గాన తరలించాల్సి వచ్చింది. చాలా మంది ప్రజలు పిల్లను, సామగ్రిని తీసుకొని మట్టిరోడ్లపైనే నడుచుకొంటూ సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు. కొందరు బీచ్‌ల్లోనే ఆశ్రయం తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేసుకొంటున్నారు. రోడ్సే అగ్ని కీలక దెబ్బకు ఇక్కడకు రావాల్సిన విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నారు. తాజాగా ఈ కార్చిచ్చు కోర్ఫు ప్రాంతానికి చేరుకొంది. ఇక్కడ రాత్రివేళల్లో కొండలు మంటలతో నిండిపోయి అగ్నిపర్వతాలను తలపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement