Thursday, October 10, 2024

National : యాత్ర‌లో ఎక్కడ ద్వేషాన్ని చూడ‌లేదు… రాహుల్‌గాంధీ

ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర వారణాసిలో కొన‌సాగుతుంది. అక్క‌డ అంద‌రితో క‌లిసి రాహుల్‌గాంధీ పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కూడా తన యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు.

యాత్ర సమయంలో ఎక్కడే ద్వేషాన్ని చూడలేదన్నారు. వాళ్లు తమతో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దేశం బలోపేతం అవుతుందని అన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమను చాటుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement