Wednesday, May 1, 2024

వాట్సాప్ కీలక మార్పులు.. కొత్త అప్డేట్ ఇదే!

దిగ్గజ మెసెంజర్ వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్ లో కీలక మార్పులు జరనున్నట్లు తెలుస్తోంది. త్వరలో విడుదలా కానున్న వెర్షన్ 2.23.18.18 లో వాట్సాప్ యాప్ కొత్త రూపు సంతరించుకోనుంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం ద్వారా త్వరలో అందరూ యూజర్లకు అప్డేట్ ను అందించనుంది.

వాట్సాప్ కొత్త అప్డేట్ లో టాప్ బార్ ను కూడా తెలుపు రంగులోకి మార్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ యాప్ టాప్ బార్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. వాట్సాప్ ఫాంట్ ఏమో తెలుపు రంగులో ఉంటుంది. కొత్తగా వచ్చే అప్టేడ్ తో వాట్సాప్ యాప్ టాప్ బార్ కూడా తెలుపు రంగులోకి మారబోతుంది. మొత్తం యాప్ ఇంటర్ ఫేస్ వైట్ కలర్ లోనే ఉండనుంది. ఇక వాట్సాప్ పేరు ప్రస్తుతం తెలుపు రంగులో కన్పిస్తుండగా, దాన్ని గ్రీన్ కలర్ లోకి మార్చనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ మెంట్ దశలోనే ఉంది. టెస్టర్లు పరీక్షిస్తున్నారు. ఇది విజయవంతమైన తర్వాత తర్వలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు యూజర్లకు వాట్సాప్ ఈ అప్డేట్ అందించనుంది. యాప్ ను అప్డేట్ చేసుకునేవారికి కొత్త ఇంటర్ ఫేస్ కన్పిస్తుంది.

- Advertisement -

అలాగే కొత్త అప్డేట్ లో కన్వర్సేషన్లను ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో యూజర్లు తమ చాట్ లిస్టును ఫిల్టర్ చేసుకోవచ్చు. అన్ రీడ్ మెసేజ్ చాట్లు, పర్సనల్ కన్వర్సేషన్లు, బిజినెస్ చాట్స్ ఇలా తమ అవసరానికి అనుగుణంగా చాట్ లిస్ట్ ను ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్రాయిడ్ యూజర్లతో పాటు, ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ అప్డేట్ ను వీలైనంత త్వరగా అందించాలని వాట్సాప్ భావిస్తోంది.

కాగా వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. ఇటీవలే వాట్సాప్ లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ప్రకటించింది. ఇప్పటికే షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు చాట్ లో మెసేజ్ లకు వీడియో రికార్డు చేసి రిప్లై ఇవ్వచ్చు. మెటా మాతృ సంస్థగా ఉన్న వాట్సాప్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఇన్ స్టాంట్ మెసెంజర్ గా అనతికాలంలో ఈ యాప్ బాగా పాపులర్ అయింది.

వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ ను కూడా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే యాప్ లో ఉన్న అన్ని ఫీచర్లు డెస్క్ టాప్ వెర్షన్ లో ఉండవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement