Thursday, May 9, 2024

22 లక్షల ఎకౌంట్లను బ్యాన్‌ చేసిన వాట్స్‌యాప్‌..

సోషల్‌ మీడియా షేరింగ్‌ కంపెనీ వాట్స్‌యాప్‌ మన దేశానికి చెందిన 22 లక్షల మంది యూజర్ల అకౌంట్‌ను జూన్‌ నెలలో బ్యాన్‌ చేసింది. నిబంధనలు ఉల్లంచిన అకౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాట్స్‌యాప్‌ ప్రకటించింది. దుర్వినియోగం చేసిన 19 లక్షల యూజర్ల అకౌంట్లను వాట్స్‌యాప్‌ మే నెలలొ నిషేధించింది. ఏప్రిల్‌ నెలలో 16 లక్షలు, మార్చిలో 18.05 లక్షల అకౌంట్లను నిషేధించినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్లను నిషేధిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న అన్ని సోషల్‌ మీడియా సంస్థలు ప్రతినెల ఇలాంటి నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని, వివాదాస్పదంగా ఉన్న పోస్టులను తొలగించడం, అలాంటి యూజర్ల అకౌంట్లను నిషేధించడం చేయాల్సి ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో పేర్కొనాలని ప్రభుత్వం ఆదేశించింది. జూన్‌నెలలో 632 ఫిర్యాదులు వచ్చాయని సంస్థ ప్రతినిధి వివరించారు. వచ్చిన అన్ని ఫిర్యాదులపై సంస్థ స్పందించిందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement