Monday, May 6, 2024

అలర్ట్: ఈరోజు రాత్రికి ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు

విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ప్రభావంతో ఈ నెల 14న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈనెల 16 నాటికి తూర్పు అరేబియా సముద్రంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రానున్న 4 గంటల్లో అంటే గురువారం రాత్రికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప​, కర్నూలు, అనంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా నుంచి వచ్చే మేఘాల వల్ల ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement