Monday, June 17, 2024

Breaking | రెండు లారీలు ఢీ.. ఎగసి పడుతున్న మంటలు

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. ఇవ్వాల (శుక్రవారం) రాత్రి సుల్తానాబాద్ వైపు వస్తున్న బియ్యం లారీని వెనుక నుండి టైల్స్ లారీ ఢీ కొట్టింది.

లారీలు ఢీకొనగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఫరియాజ్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు లారీలో ఉన్న క్లీనర్ బయటకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ సిఐ జగదీష్ చేరుకొని అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement